: ఆంధ్ర సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు: హరీష్ రావు
తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలను తప్పుదోవ పట్టించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని టీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్ర సర్కారు ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రయోజనం ఉండదని అన్నారు. అసత్య ప్రచారాలతో పారిశ్రామికవేత్తలను మభ్యపెడుతోందని విమర్శించారు. తాము చెప్పిందే చేస్తామని... ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.