: ఆసియా అత్యుత్తమ విద్యా సంస్థల్లో మూడు ఐఐటీలు
మనమెంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐఐటీలు ఆసియాలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో మాత్రం వెనుకబడ్డాయి. టైమ్స్ హయ్యార్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఆసియాలో 100 అత్యుత్తమ విద్యా సంస్థల పేరుతో ర్యాంకులను ప్రకటించింది. వాటిలో కేవలం మూడు ఐఐటీలు మాత్రమే నిలిచాయి. దేశంలో 16 ఐఐటీలు ఉన్న సంగతి తెలిసిందే.
ఖరగ్ పూర్ ఐఐటీ 30వ ర్యాంక్ దక్కించుకుంది. బోంబే ఐఐటీకి 33వ ర్యాంక్, ఐఐటీ రూర్కీకి 56వ ర్యాంక్ లభించింది. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో(జపాన్) తొలి ర్యాంక్ దక్కించుకుంది. 78.3శాతం స్కోర్ ఈ యూనివర్సిటీకి లభించింది. తర్వాత 77.5శాతం స్కోరుతో యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, 75.6 శాతం స్కోరుతో యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్, 70.7శాతం స్కోరుతో పెకింగ్ యూనివర్సిటీలు తర్వాతి స్థానాలలో నిలిచాయి.