: భారత ఫాస్టెస్ట్ ట్రైన్ ట్రయల్ రన్ నేడే
ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న ఢిల్లీ-ఆగ్రా మధ్య అత్యంత వేగంగా నడిచే ట్రైన్ ను భారతీయ రైల్వే తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఆ ట్రైన్ ట్రయల్ రన్ ను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లోని ఆరవ ఫ్లాట్ ఫామ్ లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి ఆగ్రాకు 90 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఇదే మార్గంలో నడుస్తున్న భోపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ కంటే ఇది ముప్పై నిమిషాలు వేగంగా నడుస్తుంది. నవంబర్ నుంచి ఈ ట్రైన్ సర్వీస్ ప్రారంభం కానుంది.