: శ్రీశైలం ఆలయ పనుల్లో అవకతవకలపై దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరగడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. నిజాలను వెలికి తీసేందుకు పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో పనులను ఈఈ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో ఆజాద్ బదిలీ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, ఆయన పెండింగ్ ఫైళ్లను ఆగమేఘాల మీద క్లియర్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.