: పాదయాత్రకు విరామం ప్రకటించండి: చంద్రబాబుకు వైద్యుల సూచన
'వస్తున్నా మీకోసం' పేరిటి సుదీర్ఘకాలంగా పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం పాదయాత్రకు విరామం ప్రకటించాలని వైద్యులు సలహా ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరలోని కాకరపల్లిలో ఉన్న బాబుకు ఈ ఉదయం వైద్యబృందం పరీక్షలు చేసింది. కాలినొప్పి తీవ్రంగా ఉన్న కారణంగా యాత్రకు కొంత విరామం ఇస్తే బాగుంటుందని బాబుకు వైద్యులు తెలిపారు. అయితే చంద్రబాబు పాదయాత్రను కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఆ పార్టీ నేత గరికపాటి రామ్మోహన రావు తెలిపారు. కానీ, పార్టీకి చెందిన సీనియర్ నేతలతో చర్చించాకే యాత్రపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.