: 'హీరో' కోసం చంద్రబాబు, కేసీఆర్ కుస్తీ
భారత్ లో నెంబర్ వన్ ద్విచక్రవాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సంస్థ కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులు హీరో ప్లాంట్ కోసం లాబీయింగ్ కు తెరదీశారు. దక్షిణాదిన ప్లాంట్ ఏర్పాటు చేయాలని హీరో గ్రూప్ ప్రకటించడం ఆలస్యం... ఉభయరాష్ట్రాల్లో ఆరాటం మొదలైంది. పరిశ్రమల శాఖను తమవద్దే ఉంచుకున్న ఈ రెండు రాష్ట్రాల సీఎంలు తమకున్న పలుకుబడిని భారీ ఎత్తున ఉపయోగిస్తున్నారు. తమ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే పెద్ద ఎత్తున రాయితీలిస్తామని 'హీరో'కు గాలం వేస్తున్నారు.
కాగా, హీరో సంస్థ తన మోటార్ బైక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ప్రాథమికంగా రూ.1500 కోట్లు వెచ్చించనున్నట్టు సమాచారం. మొత్తం 100 ఎకరాల్లో ఈ ప్లాంట్ నిర్మించాలన్నది హీరో మోటోకార్ప్ ప్రణాళిక.