: రెండు వారాల్లో అంజలిని కోర్టులో హాజరుపర్చండి: మద్రాస్ హైకోర్టు
రెండు వారాల్లోగా తమ ఎదుట సినీనటి అంజలిని హాజరుపర్చాలని మద్రాస్ హైకోర్టు చెన్నై పోలీస్ కమిషనర్ ని ఈ రోజు ఆదేశించింది. తన అక్క కూతురు కనిపించడం లేదంటూ అంజలి పిన్ని భారతీదేవి నాలుగు రోజుల కిందట మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాను క్షేమంగానే ఉన్నానని, రెండు రోజుల్లో బయటికి వస్తానంటూ అంజలి తన సోదరుడు రవిశంకర్ కు నిన్న ఫోన్ చేసి చెప్పిన సంగతి తెలిసిందే.