: మరో రెండు రోజులు వడగాలులు వీస్తాయ్!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 8, ఆంధ్రప్రదేశ్ లో 3 నుంచి 5 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 48 గంటల్లో రెండు రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.