: ఒబామా ఓడిపోయారు!


ఫిఫా వరల్డ్ కప్ లో బెల్జియం, అమెరికా జట్ల మధ్య జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పోరులో బెల్జియం నెగ్గడంతో అమెరికా క్వార్టర్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా, ఈ మ్యాచ్ లో తమ జట్టే నెగ్గుతుందని, అందుకు గ్రేట్ బెల్జియన్ బీర్లు పందెం కాస్తున్నానని బెల్జియం ప్రధాని ఎలియో డి రూపో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ట్వీట్ చేశారు. అయితే, దీనిపై ఒబామా ఏమీ తిరుగు టపా పంపలేదు. బెల్జియం గెలుపుతో పందెంలో డి రూపోనే గెలిచినట్టయింది. అమెరికా ఓటమితో ఒబామా స్పందించడానికి ఏమీ లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News