: ప్రధాని మోడీకి జయలలిత హృదయపూర్వక కృతజ్ఞతలు
తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆనకట్ట ఎత్తును 142 అడుగులకు పెంచుకునేందుకు తమిళనాడుకు సుప్రీంకోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఈ మేరకు దానిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సూపర్ వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. "నా విన్నపాన్ని పరిశీలించి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినందుకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు" అని మోడీకి రాసిన లేఖలో జయ తెలిపారు. ఈ మేరకు ముళ్లపెరియార్ డ్యామ్ వివాదంపై జల వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన నీటి వనరులు, శాశ్వత నదుల వింగ్ కమిషనర్ డీఎస్ ఝా ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.