: చప్రాసీనైన నన్ను ఛైర్మన్ గా చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదే: స్వామిగౌడ్
చప్రాసీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తనను శాసనమండలి ఛైర్మన్ గా చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదే అని స్వామిగౌడ్ అన్నారు. ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నానని... ఆనందబాష్పాలు రాలుతున్నాయని చెప్పారు. మండలి సమావేశాలు హుందాగా జరిగేలా కృషి చేస్తానని... తనకు అన్ని పార్టీల సహకారం కావాలని కోరారు. రాజకీయాల్లో తానింకా పసిబాలుడినే అని చెప్పారు. మండలిలో నేను, మీరు అనే పదాలను మరచిపోదామని... అందరం కలసి ముందుకు సాగుదామని తెలిపారు.