: సిగ్గుతో తలదించుకుంటున్నా: వీహెచ్


తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంపై టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలతో సిగ్గుతో తల దించుకుంటున్నానని అన్నారు. ఓటమిపై హైదరాబాదులో సమీక్ష నిర్వహించి... పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని స్థాయుల్లో ప్రక్షాళన జరగాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన నేతలపై వీహెచ్ మండిపడ్డారు. పార్టీలో ఉండి పదవులన్నీ అనుభవించిన తర్వాత ఇంకో పార్టీలోకి మారడం దారుణమని అన్నారు.

  • Loading...

More Telugu News