: గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యే రాజధాని అనుకున్నాం: ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రపదేశ్ కొత్త రాజధాని కోసం ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్యే రాజధాని అనుకున్నామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అయితే, ఇంకా ఎక్కడనేది నిర్ధారణ కాలేదన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వానికి ఇబ్బందులున్నాయని చెప్పారు. రైతు రుణమాఫీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని... స్మార్ట్ సిటీలు, రాజధానిపై కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారన్నారు.