: కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి కారణాలు ఆంటోనీ కమిటీకి వెల్లడించా: డిగ్గీరాజా


సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇన్ఛార్జ్ గా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి కారణాలపై ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చానని డిగ్గీరాజా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై వేటు పడుతుందని అన్నారు. డిగ్గీరాజా ఎక్కడ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

కాగా, దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. మూడు ప్రాంతాల్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోగా, తెలంగాణలో చావుతప్పి కన్నులొట్టబోయింది. కర్ణాటకలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. దీంతో డిగ్గీరాజాపై సొంత పార్టీలోనే విమర్శలు చెలరేగాయి.

  • Loading...

More Telugu News