: నైరోబీలో కమర్షియల్ కాంప్లెక్స్ పై కూలిన విమానం


తూర్పు ఆఫ్రికాలోని కెన్యా రాజధాని నైరోబీలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ పై విమానం ఒక్కసారిగా కూలింది. నైరోబీలోని జొమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కార్గో విమానం కొద్ది సేపటికే కూలిందని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది ప్రమాదంలో మరణించినట్టు అనుకుంటున్నామని చెప్పారు. అటు కమర్షియల్ కాంప్లెక్స్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని భవనాలను ఖాళీ చేయించామని విమానయాన శాఖ అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News