: మోడీకి క్షమాపణ చెప్పారా..?: అమీర్ ఖాన్ కు వీహెచ్పీ లేఖాస్త్రం


గుజరాత్ అల్లర్లకు మోడీయే ప్రధాన కారణమని ఒకప్పుడు పేర్కొన్న నటుడు అమీర్ ఖాన్ పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) లేఖాస్త్రం సంధించింది. ఇటీవలే మోడీని అమీర్ ఖాన్ కలిశారు. ఆ సందర్భంగా "అమీర్... ప్రధానికి క్షమాపణ చెప్పారా?" అని వీహెచ్పీ అడిగింది.

"మీరు ఇంకా ఆనాటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టయితే మేమెంతో ఆశ్చర్యపోతున్నాం. అప్పటి ఘటనలకు కారణమని మీరు ఆరోపించిన వ్యక్తిని ఇప్పుడు కలుసుకున్నారు. అంటే, క్షమాపణ చెప్పారా? మీ ట్విట్టర్ వ్యాఖ్యలను చూస్తే మీరు క్షమాపణ కోరినట్టు ఏమీ తెలియలేదు" అని వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ చౌఘ్లే లేఖలో పేర్కొన్నారు. అమీర్ ఏదో లబ్ది పొందేందుకే ప్రధానిని కలిశారని అందరూ అనుకుంటారని చౌఘ్లే అభిప్రాయపడ్డారు. దీనిపై అమీర్ స్పందన వినాలని ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News