: ఆలియా భట్ కు తప్పిన ప్రమాదం


బాలీవుడ్ నటి ఆలియా భట్ కు నేడు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కారు ఢీకొంది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హీరో వరుణ్ ధావన్ తో కలిసి 'హంప్టీ శర్మాకి దుల్హనియా' చిత్రం ప్రమోషన్ కోసం ఆలియా భట్ అహ్మదాబాద్ వెళ్ళారు. విమానాశ్రయం నుంచి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారును సిగ్నల్స్ వద్ద రిటైర్డ్ ఏసీపీ జేఎన్ పర్మార్ కారు ఢీకొంది. దీంతో, ఆలియా కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. దీంతో, ఆలియా, వరుణ్ కారుదిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాగా, పర్మార్ సోమవారమే పదవీవిరమణ చేశారు.

  • Loading...

More Telugu News