: మహంతిని విడుదల చేయాలన్న వరవరరావు
ఒడిశా పోలీసులు బరంపురంలో దండపాణి మహంతిని అరెస్టు చేయడాన్ని విరసం నేత వరవరరావు ఖండించారు. దండపాణిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నక్సల్స్ చెరలోని సుకుమా కలెక్టర్ అలెక్స్ పాల్ విడుదలకు మధ్యవర్తులుగా వ్యవహారించిన వారిలో దండపాణి ఒకరన్న విషయాన్ని ఈ సందర్భంగా వరవరరావు గుర్తు చేశారు.