: టి-శాసనమండలి ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ గెలుస్తుంది: డీఎస్


తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి హడావుడిగా ఎన్నిక నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ పదవిని గెలుస్తామని తమకు నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీ ఎమ్మెల్సీలను కోరామన్నారు. కాగా, ఛైర్మన్ ఎన్నికపై పార్టీ ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశామని ఆయన తెలిపారు. మండలి ఛైర్మన్ ఎన్నికకు రహస్య బ్యాలెట్ పెట్టడం సరికాదన్నారు. ఎన్నో సమస్యలుండగా, ఇప్పటికిప్పుడు కౌన్సిల్ సమావేశం ఎందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ ను కోరినా ప్రయోజనం లేదన్నారు.

  • Loading...

More Telugu News