: ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన శుభదర్శి చిట్ ఫండ్స్


విజయవాడలో శుభదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఖాతాదారులను నిలువునా ముంచింది. వారివద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసిన ఈ సంస్థ డబ్బులు తిరిగి చెల్లించడం లేదంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. కృష్ణలంక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై చీటింగ్ కేసు నమోదైంది. ఎండీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తాము చిట్ ఫండ్స్ సిబ్బందికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తోందని బాధితులు తెలిపారు. ఎండీ కూడా ఫోన్ స్విచాఫ్ చేశాడని వారు చెప్పారు. తాము రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా శుభదర్శి చిట్ ఫండ్స్ కు చెల్లించామని వాపోయారు.

  • Loading...

More Telugu News