: రుణమాఫీ సాకుతో ఎక్కువ రుణాలు తీసుకున్నవారు కూడా చెల్లించడం లేదట!
రుణమాఫీ వస్తుందన్న సాకుతో ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు కూడా పాతబాకీలు చెల్లించడం లేదని ఎస్ఎల్ బీసీ (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) తెలిపింది. హైదరాబాదులో ప్రారంభమైన బ్యాంకర్ల సమావేశం సందర్భంగా ఎస్ఎల్ బీసీ పలు వ్యాఖ్యలు చేసింది. రుణమాఫీ అంశంపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది. ఖరీఫ్ రావడంతో పంట రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అది ఎవరెవరికి ఇవ్వాలనే అభిప్రాయంలో స్పష్టత లేదని వారు అభిప్రాయపడ్డారు.
రుణాలపై బ్యాంకుల స్థితిగతులపై ఎస్ఎల్ బీసీ భేటీలో బ్యాంకర్ల కమిటీ ఛైర్మన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాలు 49,774 కోట్ల రూపాయలు ఇచ్చామని, వ్యవసాయ రుణ పంపిణీలో 105.86 శాతం లక్ష్యం సాధించామని తెలిపారు.