: ఏడుపాయల జాతరలో కాల్పులు


మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో జరిగే 'ఏడుపాయల జాతర' తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఫేమస్. ఈ జాతర చూసేందుకు ఎంతోమంది తండోపతండాలుగా వస్తుంటారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇక్కడికివచ్చి దైవదర్శనం అనంతరం తిరుగుప్రయాణమైంది. అయితే, కొందరు దుండగులు వీరిపై కాల్పులకు తెగబడ్డారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు పోలీసుల అనుమానం.

కాగా, కాల్పులు జరిపిన దుండగులు సదరు కుటుంబం నుంచి 14 తులాల బంగారం ఎత్తుకెళ్ళారు. తప్పుదోవపట్టించేందుకు వారు బంగారం దోచుకెళ్ళారా? లేక, వారు నిజంగానే దొంగలా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కుటుంబ సభ్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News