: లోక్ సభ ఎంపీలకు నేటి నుంచి శిక్షణ తరగతులు
లోక్ సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలకు నేటి నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభిస్తారు. సభకు సంబంధించిన నియమ నిబంధనలు, పలు సందర్భాల్లో సభ్యులు వ్యవహరించే తీరు వంటి విషయాలను ఎంపీలకు తెలిపే విధంగా శిక్షణ ఉంటుంది. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అనంతకుమార్, బీజేపీ ఎంపీ భత్రుహరి మహతాబ్, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ తో పాటు పలువురు శిక్షణ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.