: మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న మోడీ, చంద్రబాబు
శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కాసేపట్లో పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో, ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు.