: ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60కి పెంచాలి: టీఎన్జీవో డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను వెంటనే జారీ చేయాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల ఉద్యోగుల పంపకంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.