: టి.ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ షాక్... మెట్రోరైలుకు రాంరాం ?


తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎల్ అండ్ టీ షాక్ ఇచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వివరంగా చెప్పాలంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెట్రోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చారిత్రక, వారసత్వ కట్టడాలున్న (అసెంబ్లీ, సుల్తాన్ బజార్, బడీచౌడి, మొజాంజాహీ మార్కెట్ ...) ప్రాంతాల్లో మెట్రోను అండర్ గ్రౌండ్ లో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో, ఇప్పటికే పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మెలిక పెట్టడమేమిటని ఎల్ అండ్ టీ ప్రశ్నిస్తోంది. పిల్లర్లు కూడా నిర్మితమైన తర్వాత అలైన్ మెంట్ మార్పు ఏమిటని నిలదీస్తోంది.

దీనికి తోడు అండర్ గ్రౌండ్ లో మెట్రోరైలును పంపించాలంటే కొన్ని వేల కోట్ల అదనపు భారం పడుతుందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్న ప్రాంతాల్లో కొంత లోతుకు భూమిని తవ్వినా, గట్టి రాయి తగులుతుందని... దీనికి తోడు, నిజాం కాలంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయిని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో, టి.ప్రభుత్వ నిర్ణయంతో తాము ఏకీభవించలేమని... ప్రాజెక్టు నిర్మాణం నుంచి తాము తప్పుకుంటున్నామని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News