: ఆస్ట్రేలియన్ ఓపెన్ పైనల్లో సత్తా చాటిన సైనా... టైటిల్ కైవసం
ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సైనా విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో స్పెయిన్ యువ సంచలనం కరోలినాపై సైనా సత్తా చాటింది. 21-18, 21-11 తేడాతో కరోలినాను చిత్తు చేసింది. ఈ ఏడాదిలో హైదరాబాద్ అమ్మాయి సైనాకు ఇది రెండో టైటిల్.