: జగన్నాథుడు రథంపై బయల్దేరాడు
విఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఒడిశాలోని పూరీ పట్టణంలో కొలువై ఉన్న ఈ స్వామి భలబద్ర, సుభద్ర సమేతంగా శ్రీమందిరం నుంచి రథాలపై ముందుకు కదలిపోతున్నాడు. అర్చకులు విశేష పూజలు నిర్వహించిన అనంతరం దేవతా మూర్తులను రథాలలో ప్రతిష్ఠించి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. 3 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగి సాయంత్రం సూర్యాస్తమయం లోపు గుడిచా మందిరానికి చేరుకుంటుంది. అక్కడ తొమ్మిది రోజుల పాటు సేవలు అందుకున్న తర్వాత దేవతామూర్తులు తిరిగి రథాలలో మళ్లీ శ్రీమందిరానికి చేరుకుంటారు. రథయాత్రకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పట్టణంలోని వీధులు కిక్కిరిసిపోయాయి.