: సొంత జిల్లాలో కోడెలకు ఘన స్వాగతం
స్పీకర్ గా ఎన్నికైన తర్వాత తొలిసారి సొంత జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నకరికల్లు నుంచి భారీ వాహన శ్రేణితో ర్యాలీ నిర్వహించారు. ఈ రాత్రి ఆయనకు గుంటూరులో అభినందన సభ జరగనుంది.