: ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం


ఆహ్లాదకరమైన వాతావరణం... పక్కన తానెంతో ఇష్టపడ్డ ప్రియుడు. అతని సన్నిధిలో తన జీవితం పట్ల ఆమె అందమైన కలలు కంటోంది. ఇంతలో హఠాత్తుగా ఊడిపడ్డ కొంతమంది దుండగులు ఆమె కలల్ని చిదిమేశారు. వారిద్దరినీ బెదిరించి... ప్రియురాలిని ప్రియుడి ఎదుటే సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని జాకారం అటవీప్రాంతంలో జరిగింది. వారి బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ప్రియుడితో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News