: హైదరాబాదులో పీవీ ఘాట్ కు కుటుంబ సభ్యుల నివాళులు
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 93వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఆయన ఘాట్ (పి.వి విజ్ఞాన భూమి) లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ కుమారుడు రాజేశ్వరరావు తదితరులు పీవీ సమాధికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పి.వి విజ్ఞాన భూమి వేదిక వద్ద తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.