: ఇరాక్ లో 160 మంది బందీలను హతమార్చారు


ఇరాక్ లో అంతుర్యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అక్కడ మిలిటెంట్లు 160 మంది బందీలను చంపారని మానవ హక్కుల సంఘం ఇవాళ వెల్లడించింది. ఉపగ్రహ చిత్రాలు, మిలిటెంట్లు పంపిన కొన్ని ఫోటోల ఆధారంగా బందీలను హతమార్చినట్లు నిర్థారణకు వచ్చామని హెచ్ఆర్సీ తెలిపింది. ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య తిక్రిట్ నగరంలో సుమారు 160 నుంచి 190 మందిని హత్య చేసినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News