: చంద్రబాబు ఉగాది వేడుకలు


పాదయాత్రలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పండుగ జరుపుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎన్.సూరవరం గ్రామంలో పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక నేతలు నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుకు పలువురు పుష్ప గుచ్చాలు అందించారు. పంచాంగశ్రవణం అనంతరం ఉగాది పచ్చడి స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News