: తేజ్ పాల్ బెయిల్ గడువు పొడిగింపు


లైంగిక దాడి కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు లోగడ మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువును సుప్రీంకోర్టు జూలై 1వరకు పొడిగించింది. గతేడాది నవంబర్ లో గోవాలోని ఓ హోటల్ లో సహచర మహిళా జర్నలిస్టుపై లిఫ్ట్ లో తేజ్ పాల్ అత్యాచారయత్నం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన అరెస్ట్ అయ్యారు. తేజ్ పాల్ తల్లి మృతి చెందడంతో గత నెల 19న అతడికి కోర్టు మూడు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని ఈ నెల 27 వరకు పొడిగించగా, మరో సారి పొడిగిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News