: ఆర్టీసీ విభజన పూర్తి చేస్తాం: పూర్ణచంద్రరావు


ఆర్టీసీలో విభజన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ విభజన ప్రక్రియ జరుగుతోందని అన్నారు. ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు. జులై 1వ తేదీన నిపుణుల కమిటీ భేటీ కానుందని, ఆ సందర్భంగా కమిటీ ఇచ్చే నివేదికను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. దాని ఆధారంగా పంపకాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News