: నాణ్యత లేని పైపుల వల్లే ప్రమాదం జరిగింది: తోట నర్సింహం


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ లో నాణ్యత లేని పైపులు వాడడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని కాకినాడ ఎంపీ తోట నర్సింహం అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పెట్రోలియం శాఖకు విజ్ఞప్తి చేశారు. సీఎంతో కలిసి కాసేపట్లో సంఘటనా స్థలికి చేరుకుంటామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News