: బూడిదకుప్పగా ఘటనా స్థలి.. కానిస్టేబుల్ ను చితకబాదిన గ్రామస్తులు
తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు జరిగిన స్థలంలో మంటలను అదుపు చేశారు. గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 14 మంది సజీవదహనం కాగా, పలువురు గాయపడ్డారు. కాగా, నగరం గ్రామంలోని సంఘటనా స్థలం బూడిద కుప్పగా మారింది. ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని కోనసీమను బుగ్గిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో వారు ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ఓ కానిస్టేబుల్ ను చితకబాదారు.