: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేసిన కాముకుడు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడో కాముకుడు. భర్తతో విడిపోయిన ఓ యువతి రాజస్థాన్ లోని జైపూర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అదే ప్రాంతంలో వుండే నేత రామ్ రాయ్ గర్(22) అనే యువకుడితో ఆమెకు పరిచయమైంది. అనతి కాలంలోనే ఆమె వెంట పడుతూ, తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ సమయంలో వీడియో కూడా తీశాడా ఘనుడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ప్లేటు ఫిరాయించాడు. రెండున్నరేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ కామాంధుడిపై ఐపీసీ సెక్షన్ 376పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.