: గురుకుల్ ట్రస్టు భూముల్లోని ధనవంతుల ఇళ్లను కూడా కూల్చండి: మోత్కుపల్లి
హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కేవలం పేదవారి ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారని... ధనవంతుల కట్టడాలను మాత్రం వదిలేస్తున్నారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే ధనవంతుల కట్టడాలను కూడా కూల్చాలని అన్నారు. ట్రస్టుకు సంబంధించిన భూముల్లోని నిర్మాణాలన్నింటినీ తొలగించి.. పేదలకు వంద గజాల చొప్పున పంచాలని డిమాండ్ చేశారు.