: క్లీన్ హైదరాబాద్ కోసం కేసీఆర్ సూచనలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు వివిధ శాఖల సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో క్లీన్ హైదరాబాద్ పై జీహెచ్ ఎంసీ అధికారులతో సమీక్షించారు. సిటీలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో 12 నుంచి 15 వరకు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. చెత్త డంపింగ్ యార్డులకోసం కనీసం వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి ఆధారమైన గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల్లో కలుషిత నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News