: గాంధీ భవన్ లో ఉగాది సంబరాలు
శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సంబరాలు హైదరాబాద్ గాంధీ భవన్ లో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యన్నారాయణ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొండ్రు మురళి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. విజయనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.