: ఖమ్మం జిల్లాలోనూ ఓ సానియా మీర్జా ఉంది!
ఇదేంటి, సానియా మీర్జా ఖమ్మంలో ఉండడమేంటి? అనుకుంటున్నారా..! ఆ సానియా టెన్నిస్ క్వీన్ అయితే, ఈ సానియా జిమ్నాస్టిక్స్ లో ఎక్స్ పర్ట్. ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్న సానియా (11) జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించి అందరినీ అబ్బురపరుస్తోంది. అంతర్జాతీయ స్థాయి జిమ్నాస్ట్ గా ఎదగడమే తన లక్ష్యమని ధీమాగా చెబుతోందీ చిన్నారి. రబ్బరులా ఒళ్ళు వంచే ఈ వండర్ కిడ్ కు మంచి భవిష్యత్తు ఉందని కోచ్ కూడా చెబుతున్నారు. సానియా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తన కెరీర్ అభ్యున్నతికి సాయపడాలని కోరింది.