: సీట్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారడం వల్లే తెలంగాణలో ఓటమి: ఎంపీ పాల్వాయి
ఎన్నడూ లేని రీతిలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడాన్ని నేతలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో సీట్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారడం వల్లే ఎన్నికల్లో ఓటమి ఎదురైందన్నారు. ఏమీ తెలియని వాళ్లు గాంధీభవన్ లో ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. నేతల్లో, కార్యకర్తల్లో విశ్వాసం కలిగించే శక్తి పీసీసీ, సీఎల్పీ లీడర్లలో ఉండాలని సూచించారు. కాగా, పోలవరం ప్రాజెక్టును కేంద్రమే డిజైన్ చేసి నిర్మించాలని కోరారు.