: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
గురువారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకసారి చూస్తే... విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.29,900 వుండగా, రూ. 29,970 క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.29,970 వద్ద ముగింపు నమోదైంది. ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,830 ఉంటే, ముగింపు ధర రూ.29,965గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,830 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,700 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా ప్రొద్దుటూరులో రూ.53,700 ఉంది. అత్యల్పంగా విశాఖపట్నంలో రూ.52,600 పలికింది.