: అంటార్కిటికా ధ్రువం వద్ద సముద్రం గర్భం డిజిటల్ పటం
15 దేశాల శాస్త్రవేత్తలు, 30 పరిశోధన సంస్థల వద్ద సముద్రపు లోతులకు సంబంధించి ఉండే అనేకానేక వివరాలు అన్నిటినీ క్రోడీకరించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అనేకమంది కలిసి అంటార్కిటికా ధ్రువం వద్ద సముద్రపు అడుగుభాగం ఎలా ఉంటుందో సవివరంగా ప్రపంచానికి దృశ్యరూపంలో తెలియజెప్పే డిజిటల్ పటాన్ని రూపొందించారు. త్వరలోనే దీనిని పరిశోధకుల కోసం ఇంటర్నెట్లో ఉచితంగా ఉంచుతారట.
ఆల్ఫ్రెడ్ వెగెనర్ ఇన్స్టిట్యూట్, హెల్మ్హోల్జ్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ మెరైన్ రీసెర్చి సంస్థల ఆధ్వర్యంలో ఈ డిజిటల్ పటం రూపకల్పన జరిగింది.