: ఆస్తిపన్ను కట్టలేదా? అయితే వడ్డీ సహా కట్టాల్సిందే!
గ్రేటర్ హైదరాబాదు పరిధిలో నెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లించలేకపోతే... జులై ఒకటో తేదీ నుంచి వడ్డీతో పాటు కట్టాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే భవన యజమానులకు ఆస్తిపన్ను డిమాండ్ నోటీసులు అందజేశామని ఆయన అన్నారు. జులై 1 నుంచి చెల్లించే వారికి ప్రతి నెలా 2 శాతం చొప్పున వడ్డీ భారం పడుతుందన్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను కింద రూ. 161 కోట్లు వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి కేవలం రూ.83 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు చెప్పారు.