: శంకరాచార్యపై సరూర్ నగర్ పీఎస్ లో కేసు


షిరిడి సాయిబాబాపై సంచలన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదని, పూజించడం తప్పన్న ఆయన మాటలు లక్షల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, మత విశ్వాసాలను గాయపరిచారంటూ ఫిర్యాదు దారులు ఆరోపించారు. ఈ క్రమంలో సరూర్ నగర్ లో పలువురు భక్తులు ధర్నా చేశారు. తర్వాత ఊరేగింపుగా పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News