: ఆత్మస్థైర్యం మీ పక్కవారికి ఉంటే చాలు!
మనోధైర్యం, గుండెనిబ్బరం, సమస్యల్ని ఎదుర్కొనే తెగువ మీలో తక్కువని భయపడుతున్నారా? చిక్కుముడులతో సతమతం అవుతున్నట్లు భావిస్తున్నారా? అలాంటి లక్షణాలు మీకు లేకపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. ప్రతి చిన్న విషయానికి గుంజాటన పడుతూ ఉండే అలవాటు మీదైతే.. దాన్నించి బయటపడడానికి గుండెనిబ్బరం ఉన్న వారిని పక్కన పెట్టుకోండి చాలు.! సాంప్రదాయంగా ఇలా ఆధారపడడం అందరికీ తెలిసిందే అయినా.. ఇలాంటి వైఖరి చాలా సత్ఫలితం ఇస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రీయంగా పరిశోధనల్లో అది తేలినట్లు దీనిపై అధ్యయనం నిర్వహించిన కేథరిన్ షీయూ చెప్పారు. రెండు బృందాలుగా, వివిధ కోణాల్లోంచి పరిశీలించి ఈ సత్యాన్ని వారు నిగ్గుతేల్చారు.