: ఢిల్లీలో చంద్రబాబు సుడిగాలి సమావేశాలు... షెడ్యూల్ ఇదే...
హస్తిన చేరుకున్న చంద్రబాబు ఈ రోజు బిజీబిజీగా గడపనున్నారు. సుడిగాలి సమావేశాలతో క్షణం తీరిక లేకుండా వుంటారు. బాబు షెడ్యూల్ వివరాలు ఇవి... కాసేపట్లో ఆయన కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో భేటీ కానున్నారు. 11.30 గంటలకు ఉమాభారతి, 12 గంటలకు అశోక్ గజపతిరాజు, 12.45 గంటలకు వెంకయ్యనాయుడు, మధ్యాహ్నం 3.30 గంటలకు అరుణ్ జైట్లీ, సాయంత్రం 6 గంటలకు రైల్వే మంత్రి సదానందగౌడతో ఆయన సమావేశం అవుతారు. దీనికితోడు, సాయంత్రం 7 గంటలకు సీఐఐ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా వెళ్లారు. రుణమాఫీ, రాజధాని నిర్మాణం, పోలవరం అంశాలే ఢిల్లీ పర్యటనలో కీలకంగా ఉన్నాయి.