: కొత్త జీవజాతికి చెందిన గబ్బిలం గుర్తింపు
గబ్బిలం అంటేనే నల్లగా ఉంటుందని అనుకుంటున్నారు కదా.. కానీ తెల్లటి చారలతో అందంగా ముచ్చటగొలిపే గబ్బిలం కూడా ఉంటుంది. పెన్సిల్వేనియా పరిశోధకులు తాజాగా కనుక్కొన్న ఈ గబ్బిలం.. సరికొత్త జీవజాతికి చెందినదని గుర్తించారు. జీవుల వర్గీకరణలో కొత్తగా జతచేరిన ఈ జాతికి న్యూంబహా అని నామకరణం చేశారు. మధ్య ఆఫ్రికా, దక్షిణ సూడాన్ వద్దగల అజాండా ప్రజల భాష జాండేలో.. న్యూంబహా అంటే అరుదైన అని అర్థం. కొత్తగా కనుగొన్న గబ్బిలం జాతి గనుక దానికి ఆ పేరు పెట్టారు.
పెన్సిల్వేనియాలోని బక్నెల్ యూనివర్సిటీకి చెందిన డీఆన్ రీడర్ ఈ కొత్త గబ్బిలాన్ని కనుగొన్నారు. ఇలాంటి అసాధారణమైన జీవిని ఇదివరలో ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.